epaper
Wednesday, February 18, 2026
epaper

జిల్లాల మార్పుపై సీఎం రేవంత్ క్లారిటీ

కలం, డెస్క్ : జిల్లాల మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడున్న జిల్లాల్లో మార్పులు చేస్తారని.. కుదింపు ఉండొచ్చని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. 2027 వరకు జిల్లాల్లో మార్పు ఉండదని స్పష్టం చేశారు. దీంతో సీఎం వ్యాఖ్యలపై మరోసారి చర్చ జరుగుతోంది. 2027లో ఏమైనా మార్పులు ఉండొచ్చేమో అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక 2029లోనే జమిలి ఎన్నికలు (One Nation – One Election) రాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరో సారి తానే సీఎంగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు.

Read Also: ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. ఇక రోడ్లపైనే కాదు, ఆకాశంలోనూ షికారే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>