కలం, సినిమా : న్యాచురల్ స్టార్ నాని (Nani), స్టార్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ “ది ప్యారడైజ్” (The Paradise). సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని జడల్ అనే పాత్రలో కనిపించనున్నాడు. “దసరా” వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ సినిమాను మార్చి 26న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. కానీ షూటింగ్ డిలే కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. తాజాగా “ది ప్యారడైజ్”(The Paradise) మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీని ఆగష్టు 21, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Read Also: పెళ్లి రూమర్లపై మృణాల్ సెటైర్లు
Follow Us On: Sharechat


