epaper
Wednesday, February 18, 2026
epaper

వాట్సాప్​ను బ్లాక్​ చేసిన రష్యా​​

కలం, వెబ్​డెస్క్​: స్థానిక చట్టాలను పాటించడం లేదంటూ వాట్సాప్​ను రష్యా బ్లాక్​ చేసింది (Russia Blocks Whatsapp). దీనికి బదులు తమ దేశ సొంత మెసేజింగ్​ యాప్​ అయిన మాక్స్​ (MAX)ను వాడాలని పౌరులకు సూచించింది. ఈ మేరకు రష్యా నిర్ణయాన్ని క్రెమ్లిన్​ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్​ గురువారం ధ్రువీకరించారు. రష్యా చట్టాలను వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటా పాటించడం లేదని తేలినందుకే ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికి బదులు రష్యా సొంత తయారీ మెసేజింగ్​ యాప్​ అయిన మాక్స్​ను (Max App) వాడాలని తమ దేశ పౌరులకు విజ్ఞప్తి చేశారు.

కాగా, ఉక్రెయిన్​తో యుద్ధం విషయంలో రష్యాకు వ్యతిరేక సమాచారాన్ని మెటా తన ప్లాట్​ఫామ్స్​ అయిన ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​, వాట్సాప్​, మెసెంజర్​, థ్రెడ్స్​ ద్వారా ప్రచారం చేస్తోందని రష్యా భావిస్తోంది. ముఖ్యంగా వాట్సాప్​ను వాడుకొని తమ వ్యక్తిగత, దేశ భద్రత విషయాలను సేకరిస్తోందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఆర్నెళ్ల నుంచి మెటాపై తీవ్ర ఒత్తిడి చేస్తోంది. మెటా (Meta) స్పందించకపోవడంతో వాట్సాప్​ను బ్లాక్​ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది (Russia Blocks Whatsapp). దీంతో వాట్సాప్​కు అనుబంధంగా ఉన్న లింక్​లు ప్రస్తుతం రష్యాలో అదృశ్యమయ్యాయి.

మరోవైపు మెటా మీద ఇటీవల భారత ప్రభుత్వం, సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భారతీయ చట్టాలను గౌరవిస్తూ, ప్రజల గోప్యతను పాటించలేకపోతే దేశం నుంచి వెళ్లిపోవాలని హెచ్చరికలూ జారీ చేశాయి. వాట్సాప్​లో సమాచారం మెటాలోకి షేర్​ అవుతోందనే ఆరోపణల నేపథ్యంలో ఈ వార్నింగ్​ ఇచ్చాయి. అంతేకాదు, భారత చట్టాలను పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశాయి. ఈ క్రమంలో ఇదే అంశాలను చూపుతూ వాట్సాప్​ను రష్యా బ్లాక్​ చేయడం గమనార్హం.

Read Also: బాబోయ్​.. భయపెట్టిన భారీ సింక్​ హోల్​!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>