epaper
Wednesday, February 18, 2026
epaper

AI సమ్మిట్​ ఎఫెక్ట్​ : ఒక్కరాత్రి బసకు రూ.30లక్షలు!

కలం, వెబ్​డెస్క్​: దేశ రాజధానిలో ఈ నెల 16 నుంచి జరగనున్న ‘ఏఐ ఇంపాక్ట్​ సమ్మిట్’​ లగ్జరీ హోటళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది (AI Impact Summit 2026). ఢిల్లీలోని టాప్​ డీలక్స్​ లగ్జరీ హోటల్స్​లోని సూట్స్ గదుల్లో ఒక్కరాత్రి బసకు రూ.30లక్షల వరకు చేరింది. రెండు రోజుల కిందటే ఈ ధర ఉండగా, ప్రస్తుతం లగ్జరీ సూట్స్​ ఏవీ ఖాళీ లేకపోవడం గమనార్హం. ఏఐ సదస్సు జరగనున్న తేదీలకు సంబంధించిన అన్ని లగ్జరీ సూట్స్​ బుక్​ అయిపోయాయి.

ఈ నెల 16 నుంచి 20 వరకు ఢిల్లీలోని (Delhi) భారత మండపంలో ఏఐ ఇంపాక్ట్​ సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఇది దక్షిణాసియాలో జరుగుతున్న మొదటి గ్లోబల్​ ఏఐ సమ్మిట్​. దీనికి ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థానాల్లోని టెక్​ దిగ్గజాలు, వ్యాపార ప్రముఖులు, వివిధ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇందులో గూగుల్​ సీఈవో సుందర్​ పిచాయ్ (Sundar Pichai)​, ఓపెన్​ ఏఐ శామ్ ఆల్ట్​మన్​, ఎన్వీడియా అధినేత జెన్సన్​ హువాంగ్​, ఆంథ్రోపిక్​ చీఫ్​ డేరియో అమోడీ, డీప్​మైండ్స్​ అధినేత డెమిస్​ హస్సాబిస్​, మైక్రోసాఫ్ట్​ ప్రెసిడెంట్​ బ్రాడ్​ స్మిత్​, క్వాల్కమ్​ సీఈవో క్రిస్టియానో ఎమాన్​ హాజరవుతారని భావిస్తున్నారు. అలాగే 50కిపైగా దేశాల నుంచి మంత్రులు, 40కి పైగా అంతర్జాతీయ, జాతీయ కంపెనీల సీఈవోలు రానున్నారు.

వివిధ టాప్​ హోటల్స్​లో ఇలా..

ఈ క్రమంలో ఢిల్లీలోని హోటల్స్​కు డిమాండ్​ ఆకాశాన్ని తాకుతోంది. వారం నుంచే టాప్​ లగ్జరీ హోటల్స్​లో ధరలు పెరిగాయి. ఒక సూట్​కు రాత్రి బస కోసం రూ.30లక్షలు ఉన్నా, సమ్మిట్​ జరిగే తేదీల్లో ముందుగానే బుక్​ అయిపోవడం గమనార్హం. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో ఫిబ్రవరి 18–19 తేదీలకు అందుబాటులో ఉన్నది ప్రస్తుతం ‘తాజ్ క్లబ్ సూట్ కింగ్ బెడ్ ఫారెస్ట్ అండ్ పూల్ వ్యూ’ మాత్రమే. దీని ప్రారంభ ధర రూ. 3,51,000. మిగతా రకాల గదులన్నీ పూర్తిగా బుక్ అయ్యాయి.

సమ్మిట్ (AI Impact Summit 2026)​ జరగనున్న తేదీల(18‌‌–19)తో పోలిస్తే, సమ్మిట్​ అయిపోయిన వారం తర్వాత(25–26) ధరల్లో భారీ వ్యత్యాసం కనిపించింది. ఉదాహరణకు తాజ్ ప్యాలెస్‌లో వివిధ రకాల కేటగిరీలోని రూమ్స్​ ధరలు ఫిబ్రవరి 10న చూసినప్పుడు ఇలా ఉన్నాయి.

గార్డెన్ ప్రెసిడెన్షియల్ 2 బెడ్ సూట్ పూల్ వ్యూ:

  • ఫిబ్రవరి 18–19కు రూ. 30,00,000; ఫిబ్రవరి 25–26కు రూ. 3,20,000

గార్డెన్ లగ్జరీ సూట్ కింగ్ బెడ్ పూల్ వ్యూ విత్ ప్రైవేట్ టెర్రస్:

  • ఫిబ్రవరి 18–19కు రూ. 25,00,000; ఫిబ్రవరి 25–26కు రూ. 1,70,000

ది ఓబెరాయ్‌ హోటల్​లో:

  • లగ్జరీ సూట్: 18–19కు రూ. 25,00,000; 25–26కు రూ. 4,00,000
  • రూమ్ అసైన్‌డ్ ఆన్ అరైవల్: 18–19కు రూ. 5,50,000; 25–26కు రూ. 85,000

అలాగే, ఢిల్లీలోని మిగిలిన టాప్​ లగ్జరీ హోటల్స్​లోనూ ఇంచుమించు ఇదే విధంగా ధరలు ఉన్నాయి. సమ్మిట్ వారం కాకుండా ఉన్న తేదీలలో ధరలు సాధారణంగా ఉండే ధరల్లోనే కనిపించగా, సమ్మిట్ వారంలో టాప్​ రేంజ్​కు చేరాయి. కొన్ని హోటల్స్​లో పూర్తిగా బుక్​ అయ్యాయి. కొన్నింటిలో మాత్రం తక్కువ కేటగిరీ రూమ్​లు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా సాధారణ రోజుల్లోనే ధరలతో పోలిస్తే భారీగా పెరిగాయి.

Read Also: ఇయర్‌ఫోన్ లేకుండా వింటున్నారా?.. అయితే శిక్ష తప్పదు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>