కలం, డెస్క్ : మందు బాబుకు ఇది షాకింగ్ న్యూస్. ఈ మధ్య మందు బాటిళ్లలో (Liquor Bottle) రకరకాల వ్యర్థాలు కొన్ని సార్లు పురుగులు, తేళ్లు, బల్లులు కూడా వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా సరే బేవరేజెస్ కంపెనీల తీరులో మార్పు రావట్లేదు. తాజాగా ఓ వ్యక్తి కొన్న మద్యం సీసాలో కొవ్వు లాంటి పదార్థం కనిపించింది. శ్రీశైలం ప్రాజెక్టులోని (Srisailam) మద్యం షాపులో ఓ వ్యక్తి కొన్న బాటిల్ లో ఈ పదార్థం కనిపించింది. ఇదేంటిని వైన్ షాపు ఓనర్ ను అడగ్గా.. అది ఎలా వచ్చిందో తనకు తెలియదని చెప్పాడు. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగిన తర్వాత.. ఆ బాటిల్ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అది కాస్త వైరల్ అవుతోంది.
Read Also: చనిపోయినా కనికరించని కులపెద్దలు.. పాడె మోసిన భార్య
Follow Us On: Instagram


