కలం, వెబ్‌డెస్క్: భారత అమ్ముల పొది మరింత బలోపేతం కానుంది. ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించి, హీరోలా నిలిచిన రఫేల్ జెట్స్‌ను (Rafale Jets) మరిన్నింటిని కేంద్రం కొననుంది. ఈ మేరకు రూ.3.25లక్షల కోట్లతో 114 రఫేల్ జెట్స్ కొనడానికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిఫెన్స్ అక్వైజేషన్ కౌన్సిల్(డీఏసీ) ఆమోదం తెలిపింది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రన్ ఈ నెలలో భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రక్షణ ఒప్పందాల్లో భాగంగా ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలు కొనేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు తయారుచేసి, ఆమోదానికి డీఏసీకి పంపింది. ఈ క్రమంలో రఫేల్ జెట్స్ కొనుగోలుకు ఆక్సెపెటెన్స్ ఆఫ్ నెసెసిటీ (ఏవోఎన్)ను డీఏసీ మంజూరు చేసింది.
ప్రస్తుతం దేశ ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కొత్త రఫేల్ జెట్స్ (Rafale Jets) భారత వాయుసేన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. భారత్ ప్రతిపాదించిన మొత్తం 114 జెట్లలో 18ని ఫ్రాన్స్‌లోనే తయారుచేసి భారత్‌కు అందజేస్తారు. మిగిలిన 96ను భారత్‌లోనే తయారుచేసేలా ఒప్పందం సిద్ధమైంది.
Read Also: ఇయర్‌ఫోన్ లేకుండా వింటున్నారా?.. అయితే శిక్ష తప్పదు
Follow Us On: Youtube


