మహిళల ఆస్తి హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టు(Supreme Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. కచ్చితంగా మహిళలు కూడా తమ ఆస్తిపై వీలునామా రాసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. దేశంలో మహిళల ఆస్తి వారసత్వంపై తరచూ వెల్లువెత్తుతున్న వేళ సుప్రీం తీర్పు ప్రాధాన్యం సంతరించుకున్నది. మహిళల ఆస్తి పంపకం విషయంలో హిందూ వారసత్వ చట్టం (Succession Law – 1956) వస్తున్న అనేక సమస్యలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. అలాంటి వివాదాలు కుటుంబాలను చీల్చి కోర్టుల వద్దకు తీసుకెళ్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. మహిళల ఆస్తిపై తదుపరి వారసులు ఎవరు? అనే ప్రశ్నపై తరచూ వస్తున్న చట్టపరమైన సమస్యలను ధర్మాసనం ప్రస్తావించింది.
వివాదం ఏమిటి?
హిందూ వారసత్వ చట్టం(Succession Law) – 1956లోని సెక్షన్ 15(1)(b) ప్రకారం ఒక హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆ ఆస్తి భర్త, కుమారుడు, కుమార్తెకు దక్కుతుంది. వారు లేకపోతే మహిళ తల్లిదండ్రులకు దక్కాలి. అయితే ఈ చట్టం విషయంలో అవగాహన లేకపోవడంతో చాలా సందర్భాల్లో ఆస్తి భర్త తరఫు బంధువులకు దక్కుతోంది. దీంతో తరుచూ సుప్రీంకోర్టుకు ఇటువంటి పిటిషన్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. మహిళ తల్లిదండ్రులకు, వారి వారసులకు హక్కులు దక్కడం లేదు. అందుకే కచ్చితంగా మహిళలు వీలునామా రాసుకోవాలని సూచించింది. చట్టం రూపొందించిన సంవత్సరంలో కొద్ది మంది మహిళలు మాత్రమే పెద్ద మొత్తంలో ఆస్తులు కలిగి కలిగి ఉండేవారని ప్రభుత్వం భావించింది. అయితే ప్రస్తుతం విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల్లో ముందంజలో ఉన్న మహిళలు భారీగా ఆస్తులు సంపాదిస్తున్నారని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో మహిళల తల్లిదండ్రులను పక్కకు నెట్టబడటం సరైన పద్ధతి కాదని కోర్టు అభిప్రాయపడింది. ధర్మాసనం సెక్షన్ 15(1)(b) చెల్లుబాటుపై ఇప్పుడే తీర్పు ఇవ్వలేదు. ఈ విషయాన్ని సరైన పక్షాలు, సరైన సందర్భంలో సవాల్ చేయవచ్చని స్పష్టం చేసింది.
వీలునామా లేకుండా మరణించిన హిందూ మహిళ ఆస్తిపై తల్లిదండ్రులు లేదా వారి వారసులు హక్కు కోరినప్పుడు ఇలాంటి కేసుల్లో నేరుగా కోర్టుకు వెళ్లకుండా ప్రీ-లిటిగేషన్ మధ్యవర్తిత్వం తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర, జిల్లా, తాలూకా స్థాయి లీగల్ సర్వీసెస్ అథారిటీలు ఈ మధ్యవర్తిత్వం చేపట్టాలని కోర్టు సూచించింది. ఈ విధానం వల్ల కోర్టులకు వచ్చే కేసుల సంఖ్య తగ్గుతుందని, కుటుంబాల్లో విభేదాలు మరింత ఎక్కువ కావటాన్ని అరికట్టవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది.
Read Also: ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వ పాలన: కర్ణాటక మంత్రి
Follow Us on : Pinterest

