epaper
Wednesday, February 18, 2026
epaper

బీఆర్ఎస్‌కే మెజార్టీ మున్సిపాలిటీ స్థానాలు: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో గురువారం కీలక టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలను, నాయకులను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయడం ప్రశంసనీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ మున్సిపాలిటీలు బీఆర్ఎస్ (BRS) కైవసం చేసుకుంటుందనే ధీమాను వ్యక్తం చేశారు.

అనంతరం మున్సిపల్ (Municipal) ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కౌన్సిలర్ల ఎంపిక, చైర్మన్ పదవుల భర్తీ తదితర అంశాల్లో పార్టీ నిబంధనలు పాటించాలని సూచిస్తూ విప్ జారీపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏవైనా అనూహ్య పరిస్థితులు ఎదురైతే అప్రమత్తంగా ఉండాలని, పార్టీ లైన్‌కు కట్టుబడి పనిచేయాలని నేతలకు కేటీఆర్ (KTR) సూచించారు.

Read Also: మామునూరు ఎయిర్ పోర్ట్​ పనులు ప్రారంభించండి : సీఎం రేవంత్​ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>