కలం, వెబ్ డెస్క్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి, రిపోర్ట్ ఇవ్వాలని సంగారెడ్డి (Sangareddy) జిల్లా ఎస్పీకి ఎస్ఈసి ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని ఈసీ అభిప్రాయపడింది.
కాగా, నేడు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి పట్టణంలోని 34వ వార్డులోని ఇందిరా కాలనీలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సీఐ కి జగ్గారెడ్డి (Jagga Reddy) కి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ మున్సిపల్ అభ్యర్థి కాలర్ పట్టుకున్నాడని ఆరోపిస్తూ.. కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ కు చేరుకున్నారు. దీంతో వారిని ఆపడంతో విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి హుటాహుటిన పోలింగ్ బూత్ కు వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ శివకుమార్ తో పాటు హోం గార్డులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Also: స్కూల్లో కాల్పులు.. 10 మంది మృతి
Follow Us On: Sharechat


