Mobile Popup Ad
Mobile Popup Ad

స్కూల్​లో కాల్పులు.. 10 మంది మృతి

కలం, వెబ్​డెస్క్​: స్కూల్​లో దారుణం జరిగింది. తుపాకీతో విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 10 మంది మృతి చెందారు. ఈ సంఘటన కెనడా (Canada) లోని బ్రిటిష్​ కొలంబియా రాష్ట్రంలో ఉన్న టంబ్లర్​ రిడ్జ్​ టౌన్​లోని ది టంబ్లర్​ రిడ్జ్​ సెకండరీ స్కూల్​లో (Tumbler Ridge) జరిగింది. పోలీసులు, బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 1.20గంటకు స్కూల్​లో కాల్పులు జరిగాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆరుగురు అక్కడికక్కడే చనిపోయినట్లు గుర్తించారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోగా, ముగ్గురు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన మరో 25 మంది ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

కాల్పులకు పాల్పడింది బ్రౌన్​ హెయిర్​ ఉన్న ఓ మహిళ అని ప్రత్యక్ష సాక్షులు చెప్పగా, చనిపోయిన వాళ్లలో ఆమె కూడా ఉందని పోలీసులు వెల్లడించారు. కాల్పులకు కారణాలు తెలియదని చెప్పారు. చనిపోయినవాళ్లలో విద్యార్థులతోపాటు స్టాఫ్​ కూడా ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

స్కూల్​లో కాల్పుల ఘటనపై కెనడా (Canada) ప్రధాని మార్క్ కార్నీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా, కెనడాలో 2020లో నోవా స్కోటియా స్కూల్​లో జరిగిన కాల్పుల్లో 13 మంది చనిపోగా, ఆ తర్వాత ఆ స్థాయిలో జరిగిన దుర్ఘటన ఇదే.

Read Also: యువకుడి కిడ్నాప్.. మత్తు మందు ఇచ్చి మ్యారేజ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>