epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఎన్‌కౌంటర్ల వేళ మల్లోజుల వీడియో సందేశం

Mallojula Venugopal | ఇటీవల వరసగా మావోయిస్టుల ఎన్‌కౌంటర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. కీలక నేతలు ప్రాణాలు కోల్పోతున్నారు. హిడ్మా ఎన్ కౌంటర్ అనంతరం మావోయిస్టు పార్టీకి ఇక భవిష్యత్ లేకుండా పోయిందన్న చర్చ జరుగుతోంది. అతి త్వరలోనే మావోయిస్టులు మొత్తం లొంగిపోవడమో, ఎన్ కౌంటర్లలో చనిపోవడమో, అరెస్ట్ కావడమో జరుగుతందని భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ లోపే మావోయిస్టులు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్(Mallojula Venugopal) తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. లొంగిపోదలుచుకున్న మావోయిస్టులు తనను సంప్రదించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘ఇప్పుడు సమాజం పరిస్థితులు పూర్తిగా మారాయి. ఈ మార్పులను అర్థం చేసుకుని మేము ఇప్పటికే ఆయుధాలను వదిలేశాం. హింసలో ప్రయోజనం లేదని గ్రహించాం. మీరూ ఆయుధాలను వీడి బయటకు రండి. జనజీవన స్రవంతిలో కలిసిపొండి. ప్రభుత్వం అందించే పునరావాస సదుపాయాలు ఉపయోగించుకోండి. అడవుల్లో తిరుగుతూ ప్రాణాలను పణంగా పెట్టుకోవడం అవసరం లేదు” అని సూచించారు.

లొంగిపోయే ఆలోచనలో ఉన్న మావోయిస్టులు సహాయం కోసం తనను నేరుగా సంప్రదించవచ్చని చెప్పారు. ఇందుకోసం తన ఫోన్ నంబర్ 8856038533 కూడా పబ్లిక్‌గా వెల్లడించారు. ఇక మరోవైపు, ఏజెన్సీ ప్రాంతంలో వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టుల కదలికలపై భద్రతా బలగాలు కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నాయి.

Read Also: హిడ్మా లొంగుబాటుకు యత్నించారా? ఆ లేఖలో ఏముంది?

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>