epaper
Wednesday, February 18, 2026
epaper

దీపక్​​ టు మహ్మద్​ దీపక్​.. ​జిమ్​కు భారీగా తగ్గిన కస్టమర్లు!

కలం, వెబ్​డెస్క్​: ముస్లిం వ్యక్తికి మద్దతుగా నిలవడమే కాక, తన పేరును మహ్మద్ దీపక్ ​(Mohammed Deepak) అని చెప్పిన వ్యక్తికి షాక్​. అతని జిమ్​కు వచ్చే కస్టమర్ల సంఖ్య భారీగా తగ్గింది. ఎంతలా అంటే 150 నుంచి 15కు కస్టమర్లు తగ్గారు. విషయమేంటంటే.. ఉత్తరాఖండ్​లోని కోట్​ద్వార్​లో దీపక్​ కుమార్​ అనే బాడీ బిల్డర్​, కోచ్​కు బద్రినాథ్​ రోడ్డులో ‘హల్క్​ జిమ్​’ ఉంది. అతని షాపు ఎదురుగా వకీల్​ అహ్మద్​ అనే 70 ఏళ్ల వృద్ధుడు ‘బాబా స్కూల్​ డ్రస్​’ పేరుతో ఒక దుస్తుల దుకాణం నడుపుతున్నారు.

ఈ షాపులోని ‘బాబా’ అనే పేరు తొలగించాలంటూ గత నెల 26న ఓ వర్గానికి చెందిన సంస్థ సభ్యులు షాపుపై దాడికి దిగారు. అది చూసి వాళ్లను దీపక్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగింది. అనంతరం వాళ్లు పేరు అడగ్గా, మహ్మద్​ దీపక్ అని చెప్పారు. అనంతరం వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, గొడవకు సంబంధించిన విషయం, ముస్లిం వ్యక్తికి మద్దతుగా నిలిచే క్రమంలో తన పేరు మహ్మద్​ దీపక్​గా చెప్పడంతో మీడియా, సోషల్​ మీడియాలో వార్తలు వచ్చాయి. దీపక్​ను, అతని ధైర్యాన్ని అభినందిస్తూ ఎంతో మంది మెసేజ్​ చేశారు. సోషల్​ మీడియాలో కామెంట్లు పెట్టారు.

అయితే, రెండు వారాల్లోనే దీపక్ (Mohammed Deepak) పరిస్థితి తలకిందులైంది. అతని జిమ్​కు వచ్చే కస్టమర్ల సంఖ్య 90శాతానికి తగ్గిపోయింది. దీంతో దీపక్​ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. జిమ్ రెంట్​ రూ.40వేలతోపాటు నెలనెలా చెల్లించాల్సిన హోమ్​లోన్​ రూ.16వేలు ఎలా కట్టాలో తెలియడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం దీపక్ కుటుంబం అతని 70 ఏళ్ల తల్లి నడుపుతున్న టీ స్టాల్​ ఆదాయంపై ఆధారపడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>