కలం, డెస్క్ : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను (Pawan Kalyan) ఇద్దరు చిన్నారుల వీడియో కదిలించింది. కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని ఇద్దరు చిన్నారులు సత్య, చంటి అనాథలయ్యారు. వాళ్లిద్దరూ తమను ఆదుకోవాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను (Pawan Kalyan) కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. రెండేళ్ల క్రితం తండ్రి, కొన్ని రోజుల క్రితమే తల్లిని కోల్పోయామని.. ఉండటానికి ఇల్లు కూడా లేదని వాపోయారు. తమను ఆదుకోవాలంటూ కోరారు.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి పవన్ కల్యాణ్ ను వేడుకున్నారు. వెంటనే స్పందించిన పవన్ కల్యాణ్.. చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున రూ.10వేలు ప్రతి నెలా అందించాలని తన స్టాఫ్ ను ఆదేశించారు. చిన్నారులకు ఇల్లు కట్టించాలని, ఇద్దరినీ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో చేర్పించాలని కాకినాడ కలెక్టర్ ను ఆదేశించారు. పవన్ స్పందనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


