epaper
Wednesday, February 18, 2026
epaper

వరంగల్‌లో మున్సిపల్ పోలింగ్‌కు సర్వం సిద్ధం

కలం, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ పోలింగ్ కు (Municipal Elections) సర్వం సిద్ధం చేశారు అధికారులు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఓటర్ల సంఖ్య 10526 ఉండగా పురుషులు 5109, మహిళలు 5416 ఉన్నారు. 12 వార్డుల గాను 50 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికారులు 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 100 మంది పోలింగ్ సిబ్బంది పోలింగ్ విధుల్లో ఉంటారు. 70 మంది పోలీస్ సిబ్బంది బందోబస్త్ నిర్వహించనున్నారు.

నర్సంపేట మున్సిపాలిటీ..

ఈ మున్సిపాలిటీలో (Municipal Elections) మొత్తం 30వార్డులు ఉన్నాయి. 40,968 ఓటర్లు ఉండగా పురుషులు 19,642, మహిళలు 21323 మంది ఉన్నారు. 30 వార్డులకు గాను 228మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 60 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు 300 మంది సిబ్బందిని నియమించారు. 250 మంది పోలీస్ సిబ్బంది బందోబస్త్ నిర్వహిస్తున్నారు.

మరిపెడ మున్సిపాలిటీ..

ఈ మున్సిపాలిటీ లో 15 వార్డుల్లో 13,687 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 6978, మహిళలు 6709 మంది ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు 25 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 150 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండబోతున్నారు. 100 పోలీస్ సిబ్బంది బందోబస్త్ నిర్వహిస్తున్నారు.

జనగామ జిల్లాలో..

జనగామ మున్సిపాలిటీలో (Jangaon Municipality) మొత్తం 30 వార్డులకు గాను 127 మంది బరిలో ఉన్నారు. 44,045 మంది ఓటర్లకు గాను మహిళలు 22678, పురుషులు 21358 మంది ఉన్నారు. ఇతరులు 09 మంది ఉన్నారు. ఇక్కడ ఎన్నికల కోసం 22 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 420 మంది పీఓ, ఏపీవో, ఓపీఓ అధికారులను నియమించారు. 22 పోలింగ్ కేంద్రాల్లో 8 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు.

స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ…

ఈ మున్సిపాలిటీలో (Station Ghanpur Municipality) మొత్తం 18వార్డులు ఉండగా 18,550 ఓటర్లున్నారు. పురుషులు 8,913, మహిళలు 9,636 మంది ఉండగా.. ఇతరులు 1 ఉన్నారు. 18 వార్డుల గాను 82 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 6 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 98 మంది పోలీస్ సిబ్బంది బందోబస్త్ నిర్వహిస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

భూపాలపల్లి మున్సిపాలిటీలో (Bhupalpally Municipality) మొత్తం 30వార్డులకు గాను 52,726 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 26786, మహిళలు 25,936 మంది.. ఇతరులు నలుగురు ఉన్నారు. 30 వార్డులగాను ఎన్నికల బరిలో 107 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు 75 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు.

డోర్నకల్ మున్సిపాలిటీలో (Dornakal Municipality) 15 వార్డులకు 16 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలో 10,869 ఓటర్లు ఉండగా పురుషులు 5,160, మహిళలు 5,709 మంది ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు 120 మంది పోలింగ్ సిబ్బంది, 80 మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నారు.

ములుగు మున్సిపల్ (Mulugu Municipality) ఎన్నికల నిర్వహణకు 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.100 పోలింగ్ అధికారులు, సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఈ మున్సిపాలిటీ లో 13,963 మంది ఓటర్లు ఉన్నారు.

Read Also: మున్సిపాలిటీలకు నిధులిచ్చేది కేంద్రమే : కిషన్​ రెడ్డి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>