కలం, వెబ్ డెస్క్ : విశ్రాంత ఉద్యోగుల చావులకు రాష్ట్ర ప్రభుత్వం కారణం అని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ పై సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ఆయన లేఖ రాశారు. పదవి విమరణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ చెల్లించకుండా వేదనలకు గురి చేయడం న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. జీవిత మలి దశలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన విశ్రాంత ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం క్షమించరానిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారని ఆరోపించారు.
రిటైర్డ్ అయిన తరువాత ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ఉద్యోగులను ప్రాధాన్యత లేని క్యాటగిరిగా భావిస్తున్నారా, మీకు మానవత్వం ఉందా? అంటూ ధ్వజమెత్తారు. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయీలు అన్నీ చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని, కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాకపోతే హైదరాబాద్ నడిబోడ్డున నిరసనలు తెలియజేస్తాం అని బండి సంజయ్ (Bandi Sanjay ) హెచ్చరించారు.
Read Also: బాబ్రీ మసీదు పునర్నిర్మాణం అసాధ్యం : ఆదిత్యనాథ్
Follow Us On: Instagram


