కలం, డెస్క్ : ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ (BJP Chief Madhav). ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని.. పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు తప్పవన్నారు. ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరుపుతామని తెలిపారు. కూటమిలో బీజేపీ భాగమే అని.. ప్రభుత్వానికి బీజేపీ ఎప్పుడూ మద్దతుగానే ఉంటుందని మాధవ్ (Madhav) తెలిపారు.
ఏమైందంటే..?
మొన్న తిరుపతిలో (Tirupati) నిర్వహించిన బీజేపీ మీటింగ్ లో ఆ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి (Adinarayana Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వంలో పదవుల కేటాయింపు కమ్మగా ఉందని తెలిపారు. కమ్మగా అంటే అర్థం ఏంటో అందరికీ తెలిసే ఉంటుందని చెప్పారు. కమ్మ కులంతో పాటు మిగతా వారికి కూడా అవకాశాలు ఇవ్వాలని కోరారు. బీజేపీ లేకపోతే కూటమి ప్రభుత్వం లేదన్నారు. కూటమిలో బీజేపీ తర్వాతే టీడీపీ, జనసేన ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో కూటమిలో ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యలకు మాధవ్ (BJP Chief Madhav) పై విధంగా స్పందించారు.
Read Also: అసెంబ్లీకి జగన్.. వాటిపై ప్రశ్నిస్తారా.. సైలెంట్ అవుతారా..?
Follow Us On: Instagram


