కలం, వెబ్ డెస్క్ : శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (Srisailam Brahmotsavams) అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నేడు 3వ రోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సాయంత్రం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం తరపున అధికారులు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
సాయంత్రం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లు హంస వాహనంపై ఆశీనులై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ వాహన సేవ అనంతరం రాత్రి సమయంలో క్షేత్ర పురవీధుల్లో స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కన్నులపండువగా జరగనుంది. మంగళవాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ మధ్య సాగే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
Read Also: ‘బస్తర్’ సాంస్కృతిక వైభవం: ప్రధాని మోదీ
Follow Us On: Sharechat


