epaper
Wednesday, February 18, 2026
epaper

రామ్ చరణ్ ‘పెద్ది’ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ (Peddi). ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన ఈ సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీస్ నిర్మాణంలో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన క్యూట్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ‘చికిరి చికిరి’ సాంగ్ సంచలనం సృష్టిస్తుంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) మ్యూజిక్ అందించిన ఆ సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

రెహమాన్ మ్యూజిక్‌కి ఫిదా అయిన ఫ్యాన్స్ సెకండ్ సాంగ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా మేకర్స్ ఈ సినిమా (Peddi) నుంచి రెండో పాటను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ రోజు రొమాంటిక్ సాంగ్ కాకుండా పక్కా మాస్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ డిలే కారణంగా పెద్ది సినిమాను ఏప్రిల్ 30న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Read Also: బైక్ మీద చేసే విన్యాసం.. నూరేళ్ల ఆయుష్షుకు వినాశనం

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>