కలం, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన ‘బస్తర్ పండుమ్’ (Bastar Pandum) ఉత్సవాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) హర్షం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు జరిగిన ఈ వేడుకలు బస్తర్ ప్రాంతపు అద్భుతమైన సంస్కృతిని, గిరిజన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు, నిర్వాహకులకు పీఎం తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఒకప్పుడు బస్తర్ పేరు వింటే మావోయిజం (Maoism), హింస, వెనుకబాటుతనం గుర్తుకు వచ్చేదని, కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుత బస్తర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతూ, స్థానిక ప్రజల ఆత్మవిశ్వాసానికి చిరునామాగా నిలుస్తోందని ఆయన అన్నారు. మన సాంస్కృతిక మూలాలను కాపాడుకోవడంలో ఇటువంటి ఉత్సవాలు (Bastar Pandum) కీలక పాత్ర పోషిస్తాయని, రానున్న కాలంలో బస్తర్ శాంతి, ప్రగతితో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
Read Also: శ్రీశైలంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Follow Us On: Sharechat


