epaper
Wednesday, February 18, 2026
epaper

అత్తాపూర్‌లో అగ్నిప్రమాదం..

కలం, వెబ్​ డెస్క్​: హైదరాబాద్ లోని అత్తాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న ఒక కార్ల షోరూమ్ సర్వీస్ సెంటర్లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం (Attapur fire accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో షోరూమ్ లోపల ఉన్న పలు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

షోరూమ్ నిర్వాహకుల అజాగ్రత్త, భద్రతా లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందని, ఎవరో కావాలనే ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారని షోరూమ్ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. షోరూమ్ లోని సీసీ టీవీ ఫుటేజ్ ను సేకరించిన అధికారులు, ప్రమాదానికి అసలు కారణం ఏంటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>