కలం, వెబ్‌డెస్క్: డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన వ్యాఖ్యలు చేసింది (Digital Arrest Frauds). ఈ మోసాలను తీవ్రమైన దోపిడీలుగా అభివర్ణించిన అత్యున్నత న్యాయస్థానం.. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, కుట్ర లేకుండా ఇలాంటివి సాధ్యం కావంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. డిజిటల్ అరెస్ట్ మోసాలపై దాఖలపైన పిటిషన్‌ను సోమవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.
డిజిటల్ అరెస్ట్ మోసాల (Digital Arrest Frauds) ద్వారా రూ.54వేల కోట్లకు పైగా సొమ్ము గల్లంతవడంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చాలా చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించింది. డిజిటల్ మోసాలను భారీ దోపిడీలుగా పేర్కొంది. డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లను అడ్డుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తోపాటు బ్యాంకులు, టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) కలసి పనిచేయాలని సూచించింది. ఈ మూడు విభాగాలతో కలపి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రామాణిక కార్యాచరణ విధానం (SOP) రూపొందించాలని చెప్పింది. డిజిటల్ నేరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు నాలుగు వారాల్లో ఒక ముసాయిదా అవగాహనా ఒప్పందం తయారు చేయాలని ఆదేశించింది.
డిజిటల్ అరెస్ట్ బాధితులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఆచరణాత్మకమైన, ఉదారమైన దృక్పథం అవసరమని సుప్రీం పేర్కొంది. నిరుడు డిసెంబర్ 16న, డిజిటల్ అరెస్టుల బాధితులకు పరిహారం అందించేందుకు అమికస్ క్యూరీ సూచించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని సూచించింది.
Read Also: నకిలీ హిమాలయ ‘లివ్.52’ ట్యాబ్లెట్స్ తయారీ ముఠా అరెస్ట్
Follow Us On : WhatsApp


