epaper
Wednesday, February 18, 2026
epaper

వేశ్యావృత్తి చేయమన్న అత్తమామలు.. కోడలు ఆత్మహత్య​

కలం, వెబ్​డెస్క్​: ధనదాహం మనుషుల్ని క్రూరులుగా, రాక్షసులుగా మార్చి సొంతవాళ్లనే బలి తీసుకుంటుందనే దానికి మరో ఉదాహరణ ఇది. డబ్బుకు ఆశపడిన అత్తమామలు ఇంటి కోడల్ని పాడుపని చేయమనడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కర్ణాటక(Karnataka)లో జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బీదర్ (Bidar)​ జిల్లా భల్కి గ్రామానికి చెందిన విజయకుమార్​ కూతురు అంజనాభాయ్​​(22)కి అదే జిల్లా బసవకళ్యాణకు చెందిన శేఖర్​ పాటిల్​తో 2022లో వివాహమైంది. ఈ దంపతులకు 11 నెలల చిన్నారి ఉన్నాడు. శేఖర్​ పానీపూరి అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే, పెళ్లైన కొన్ని రోజుల నుంచే దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. భర్తతోపాటు, అత్తమామలు అరుణభాయ్​, చంద్రకాంత్​ పాటిల్​ల​ వేధింపులు రోజూ జరిగేవి. వీటి గురించి తండ్రి విజయ్​కుమార్​కు ఫోన్​ ద్వారా చెప్పుకొని అంజనాభాయ్​ బాధపడేది.

ఇటీవల డబ్బు కోసం కోడల్ని వేశ్యావృత్తిలోకి దించాలని అత్తమామలు బలవంత పెట్టారు. ఆమె ఒప్పుకోకపోవడంతో చిత్రహింసలకు గురిచేశారు (Karnataka). దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన అంజనాభాయ్​ మెట్టినింట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లైన రోజు నుంచే తన కూతుర్ని డబ్బుకోసం అత్తమామలు, భర్త చిత్రహింసలకు గురిచేశారని, ఆమెను బలవంతంగా పడుపువృత్తిలోకి దించాలని ప్రయత్నించారని తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read Also: ప్రేమించ‌డం లేద‌ని యువ‌తిపై క‌త్తితో దాడి!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>