వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్ రెడ్డి(Karumuru Venkat Reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. కారుమూరి నిత్యం టీడీపీ నేతలను కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటారన్న విషయం తెలిసిందే. ఇటీవల కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ఆయన ప్రభుత్వాన్ని బద్నాం చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏపీ పోలీసులు మంగళవారం హైదరాబాద్‌లో ఆయనను అరెస్ట్ చేశారు. తాడిపత్రి రూరల్ పోలీసులు ప్రత్యేక బృందంగా చేరుకుని కూకట్‌పల్లిలోని మెరీనా స్కైస్ అపార్ట్‌మెంట్ వద్ద వెంకట్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై ఏపీలో పలు కేసులు నమోదై ఉన్నట్టు సమాచారం.
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు
కర్నూలు బస్సు ప్రమాద ఘటన అనంతరం ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుపై వెంకట్‌రెడ్డి తీవ్ర స్థాయిలో, అవమానకరంగా మాట్లాడారని టీడీపీ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించారని, బాధ్యతాయుత స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం ఎట్టి పరిస్థితుల్లోనూ సమంజసం కాదని పాలకపక్షం అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తాడిపత్రి టీడీపీ నేత ప్రసాదనాయుడు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, వెంకట్‌రెడ్డి(Karumuru Venkat Reddy)ని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆయన వాడిన సెల్‌ఫోన్ సిగ్నల్‌ను ట్రేస్ చేసిన పోలీసులు ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు నిర్ధారించారు. సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా గుర్తించిన మెరీనా స్కైస్ అపార్ట్‌మెంట్‌కు పోలీసులు మంగళవారం ఉదయం చేరుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
Read Also: పటియాలా హౌస్‌కు బాంబు బెదిరింపు.. ఢిల్లీలో మళ్లీ హైఅలర్ట్
Follow Us on: Youtube

