Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు హైకోర్టుకు అంబ‌టి.. బెయిల్‌పై కీల‌క తీర్పు

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత అంబ‌టి రాంబాబు (Ambati Rambabu)ను నేడు పోలీసులు హైకోర్ట్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. నగరంపాలెం, పట్టాభిపురం పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసులు క్వాష్‌ చేయాలని కోరుతూ అంబటి రాంబాబు హైకోర్ట్‌లో పిటిషన్ దాఖ‌లు చేశారు. ఈ పిటిషన్లపై నేడు కోర్టు విచారణ జ‌రుగ‌నుంది. అలాగే అంబటి బెయిల్ పిటిష‌న్‌, క‌స్ట‌డీ పిటిష‌న్‌ల‌పై కూడా నేడే విచార‌ణ జ‌రుగ‌నుంది. స్పెష‌ల్ మొబైల్ కోర్ట్ ఈ కేసుల‌ను విచారించి తీర్పు ఇవ్వ‌నుంది. సీఎం చంద్ర‌బాబుపై అనుచిత వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో పోలీసులు అంబ‌టి రాంబాబును అరెస్ట్ చేశారు. అనంత‌రం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. ఇప్ప‌టి వ‌ర‌కు అంబ‌టి రాంబాబుపై 36 కేసులు న‌మోదైన‌ట్లు స‌మాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>