epaper
Wednesday, February 18, 2026
epaper

నీట్​ యూజీ నోటిఫికేషన్​ రిలీజ్​.. దరఖాస్తు చేద్దామిలా

కలం, వెబ్​డెస్క్​: దేశవ్యాప్తంగా మెడికల్​ కాలేజీల్లో వైద్య విద్య చదవడానికి నిర్వహించే నీట్​ యూజీ 2026 (NEET UG 2026) ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్​ విడుదలైంది. ఈ మేరకు నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ(NTA) ఆదివారం నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. ఎంబీబీఎస్​, బీడీఎస్​, బీఎస్​ఎంఎస్​, బీయూఎంఎస్​, బీహెచ్​ఎంఎస్​ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ నీట్​ పరీక్ష మే 3న జరుగుతుంది. ఆ రోజు ఒకే సెషన్​లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారు. ఇంగ్లీష్​, తెలుగుతోపాటు మరో 11 ప్రాంతీయ భాషల్లో పరీక్ష ఉంటుంది.

ఆన్​లైన్​లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. చివరి తేదీ మార్చి 8. దరఖాస్తుల్లో మార్పుచేర్పులు మార్చి 10 నుంచి 12 వరకు చేసుకోవచ్చు. అప్లికేషన్​ ఫీజు జనరల్​కు రూ.1,700; ఈడబ్ల్యూఎస్​/ఓబీసీ–ఎన్​సీఎల్​కు రూ.1,600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, థర్డ్​ జెండర్​ వాళ్లకు రూ.1,000. విదేశీ అభ్యర్థులకైతే రూ.9,500 ఫీజు ఉంటుంది. దరఖాస్తు రుసుముకు ప్రాసెసింగ్​ ఫీ, జీఎస్​టీ అదనం.

రిజిస్ట్రేషన్​లో ఈ మార్పులు..
  • ఐడీ గుర్తింపుకోసం ఆధార్​ ఈకేవైసీ ఉండాలి.
  • దరఖాస్తు సబ్మిట్​ చేసే సమయంలో అభ్యర్థి లైవ్​ ఫోటో క్యాప్చర్​ చేయాలి. ఇది, ఆధార్​ కార్డుతో సరిపోవాలి. ఒకవేళ సరిపోలక పోతే అభ్యర్థి గుర్తింపును తెలిపే ఇతర ధ్రువపత్రాలు సమర్పించాలి  .
  •  పరీక్ష కేంద్రం: అభ్యర్థి శాశ్వత లేదా తాత్కాలిక నివాసం ఆధారంగా పరీక్ష కేంద్రాన్ని నిర్ణయిస్తారు (NEET UG 2026).
దరఖాస్తు ఎలా చేయాలంటే?

మొదట https://neet.nta.nic.in/ వెబ్​సైట్​లోకి వెళ్లి ‘న్యూ రిజిస్ట్రేషన్​’ లింక్​ మీద క్లిక్​ చేయాలి. అందులో అడిగే వివరాలను ఇవ్వాలి. దీంతో అప్లికేషన్​ నెంబర్​, పాస్​వర్డ్​ క్రియేట్​ అవుతుంది. వీటి ఆధారంగా అప్లికేషన్​ ఫామ్​లో లాగిన్​ కావాలి. అందులో అడిగే డీటైయిల్స్​ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్​ అప్​లోడ్​ చేయాలి. అప్లికేషన్​ ఫీజు చెల్లించి, దరఖాస్తు ఫామ్​ను సబ్మిట్​ చేయాలి. పూర్తయిన అప్లికేషన్​ ఫామ్​ను ప్రింటవుట్​ తీసుకోవాలి.

మరిన్ని వివరాలు https://neet.nta.nic.in/ వెబ్​సైట్​లోని నోటిఫికేషన్​లో తెలుసుకోవచ్చు.

Read Also: మున్సిపోల్స్.. కుంభస్థలంపై కాంగ్రెస్ ఫోకస్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>