epaper
Wednesday, February 18, 2026
epaper

కర్ణాటకలో కూలిన ప్రైవేట్​ విమానం

కలం, వెబ్​డెస్క్​: కర్ణాటకలో (Karnataka) ఓ ప్రైవేటు విమానం కూలిపోయింది (Private Aircraft Crashes). ఈ ఘటనలో పైలెట్​తో సహా మరో వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం కలబురిగి నుంచి బెళగావికి రెండు సీట్ల చిన్న శిక్షణ విమానం బయలుదేరింది. అయితే, కాసేపటికి విజయపుర జిల్లా బబలేశ్వర్ (Babaleshwar)​ తాలూకా మంగళూరు గ్రామం వద్ద ఈ ఎయిర్​క్రాఫ్ట్​ కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న పైలెట్​తోపాటు మరో వ్యక్తి విమానం కూలడానికి కొద్ది క్షణాల ముందు చాకచక్యంగా కిందకు దూకేశారు.

ఈ ఘటనలో వాళ్లు స్పల్పగాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, నేలను ఢీకొన్ని విమానం మూడు ముక్కలైంది (Private Aircraft Crashes). దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

Read Also: పగలు సాఫ్ట్‌వేర్.. రాత్రి గజదొంగ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>