Mobile Popup Ad
Mobile Popup Ad

టికెట్ రానివాళ్లకు న్యాయం చేస్తాం : సీఎం రేవంత్

కలం, డెస్క్ : మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు రాని వాళ్లకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హామీ ఇచ్చారు. భూపాలపల్లి జిల్లాలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘కొంతమందికి చాలాకాలం పనిచేసినా పార్టీ టికెట్ రాదు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్ రావడం పెద్ద గుర్తింపు. టికెట్ రాని వాళ్లు బాధపడొద్దు. మీకు మేం అండగా ఉంటాం. టికెట్ వచ్చిన వారితో సమన్వయం చేసుకుని పార్టీ కోసం కష్టపడాలి. భూపాలపల్లిలో (Bhupalpally) టికెట్ వస్తే గెలుస్తామనే పరిస్థితి కనిపిస్తోంది. టికెట్ రాని వాళ్లను నిర్లక్ష్యం చేయొద్దు’ అంటూ సీఎం రేవంత్ సూచించారు.

ప్రతి ఓటరును ఒకటికి నాలుగుసార్లు కలవాలని.. సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకం ఉన్న వారినే ప్రజలు గెలిపిస్తారని సీఎం తెలిపారు. ‘ఈ ఎన్నికల్లో అభ్యర్థుల కోసం నాయకులు కష్టపడాలి. పార్టీని గెలిపించుకుని అన్ని పనులు చేయించుకోవాలి. భూపాలపల్లిలో అన్ని సీట్లను గెలవండి. నిధులు మంజూరు చేసే బాధ్యత నాది’ అని సీఎం రేవంత్ (Revanth Reddy) హామీ ఇచ్చారు.

Read Also: కర్ణాటకలో కూలిన ప్రైవేట్​ విమానం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>