epaper
Wednesday, February 18, 2026
epaper

కిడ్నాప్​ కేసు.. మంచు విష్ణుకు నోటీసులు

కలం, వెబ్​ డెస్క్​ : మోహన్ బాబు యూనివర్సిటీలో (MBU) విద్యార్థి నేతల కిడ్నాప్ వ్యవహారం తిరుపతిలో కలకలం రేపుతోంది. ఫీజుల దోపిడీపై నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ నేతలను కిడ్నాప్ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu)కు చంద్రగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేశారు. వారిలో యూనివర్సిటీ సిబ్బందితో పాటు బౌన్సర్లు కూడా ఉన్నారు. విద్యార్థి నేతలు షేక్ అలీ అక్బర్, వినోద్ కుమార్‌లను వాహనాల్లో వచ్చి బలవంతంగా తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో యూనివర్సిటీ పీఆర్ఓ సతీష్‌ను A1గా, మోహన్ బాబును A2గా, మంచు విష్ణును A3గా చేర్చారు.

ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం తనపై ఉన్న ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ మోహన్ బాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు మంచు విష్ణు (Manchu Vishnu) తనకున్న ముందస్తు షెడ్యూల్స్ కారణంగా వారం రోజుల్లోగా విచారణకు వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read Also: చిత్తూరులో జ‌నావాసాల్లోకి ఏనుగులు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>