కలం, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) భారత్ బోణీ కొట్టింది (India Beat USA). ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శనివారం యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో తడబడినా గట్టెక్కింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (84 నాటౌట్; 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో రాణించాడు. మిగిలిన వాళ్లలో ఇషాన్ కిషన్(20), తిలక్ వర్మ(25), అక్షర్ పటేల్ మాత్రమే (14) రెండంకెల స్కోరు చేశారు. ప్రత్యర్థి బౌలర్లలో షాడ్లే వాన్ స్కాల్కివిక్ 4 వికెట్లతో బెంబేలెత్తించాడు. హర్మీత్ సింగ్ 2 వికెట్లు తీయగా, మహ్మద్ మెహసిన్, అలీ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.
ఛేదనలో యూఎస్ఏ 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు చేసింది. చివరి వరకూ పోరాడినా 29 పరుగుల తేడాతో ఓడిపోయింది (India Beat USA). ఆ జట్టు బ్యాటర్లలో మిలింద్ కుమార్(34), సంజయ్ కృష్ణమూర్తి(37), శుభమ్ రంజన్(37) రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ చెరో 2 వికెట్లు తీశారు. వరుణ్ చక్రవర్తికి 1 వికెట్ దక్కింది. సూర్యకుమార్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Read Also: బూతులు మాట్లాడేవారికి ప్రజలే బుద్ధిచెప్పాలి : వెంకయ్య నాయుడు
Follow Us On: Sharechat


