కలం, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం సమీపంలోని పోచారం (Pocharam) ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం (ORR Crash) చోటు చేసుకుంది. నెహ్రూ జూపార్క్ నుంచి బాచుపల్లి వెళ్తుండగా ఓ కారు ప్రమాదవశాత్తు సర్వీస్ రోడ్డుపై ఎగిరి పడింది. ఓవర్ స్పీడ్ కారణంగానే అదుపు తప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో ఓ చిన్నారితో సహా ఏడుగురు కార్లో ప్రయాణిస్తున్నారు. సర్వీస్ రోడ్డుపై ఎగిరిపడడంతో కారు నుజ్జునుజ్జయింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: భారత్కు షాక్.. అభిషేక్ ఔట్
Follow Us On: Youtube


