epaper
Wednesday, February 18, 2026
epaper

భారత్‌కు షాక్‌.. అభిషేక్‌ ఔట్‌

కలం, వెబ్​డెస్క్​: యూఎస్​​ఏ​తో (USA) మ్యాచ్ ఆరంభంలోనే టీమిండియాకు షాక్ తగిలింది. సున్నా పరుగులకే అభిషేక్ శర్మ (Abhishek Sharma) వికెట్ కోల్పోయాడు. అలీఖాన్ బౌలింగ్‌లో సిక్సర్‌కు ప్రయత్నించగా బౌండ్రీ లైన్​ దగ్గర సంజయ్ క్యాచ్ పట్టాడు. దీంతో అభిషేక్ శర్మ గోల్డెన్ డక్‌తో పెవిలియన్ చేరాడు. ఇది USA జట్టు నుంచి అద్భుతమైన ప్రణాళికతో కూడిన అమలు అని చెప్పాలి. అలీ ఖాన్ పూర్తి లెంగ్త్ బంతిని వేయడంతో, డీప్ కవర్‌లో ఫీల్డర్‌ను ఉంచి అభిషేక్‌ను లాఫ్టెడ్ షాట్ ఆడేలా ప్రలోభపెట్టారు. అయితే భారత ఓపెనర్‌కు అవసరమైన ఎలివేషన్ రాలేదు. ఫలితంగా బంతి డీప్‌లో ఉన్న ఫీల్డర్ చేతికి చేరి వికెట్ పడింది.

టీ20 వరల్డ్​ కప్​లో (T20 World Cup) ముంబైలోని వాంఖడే స్టేడియం తొలి మ్యాచ్​ను ఆతిథ్య జట్టు యూఎస్​ఏతో ఆడుతోంది. ఈ మ్యాచ్​లో భారత్​ మొదట బ్యాటింగ్​ చేస్తోంది. ఇందులో అభిషేక్ (Abhishek Sharma) తర్వాత వనడౌన్ స్థానంలో తిలక్ వర్మ క్రీజ్‌లోకి వచ్చాడు. స్టార్టింగ్‌లో దూకుడుగా కాకుండా డిఫెన్స్‌తో నిలకడగా ఆడాలన్న తీరులో తిలక్ వర్మ ఆడుతున్నాడు. పిల్లకుంకలు అని భావించిన యూఎస్ఏ బైలర్లు టఫ్ బౌలింగ్‌తో మ్యాచ్ ఆరంభంలో గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో రెండు ఓవర్లకు గానూ భారత్ ఒక వికెట్ కోల్పోయి 9 పరుగులు మాత్రమే చేసింది. భారత బ్యాటర్ల ఊపునకు యూఎస్ఏ బౌలర్లు తల్లడిల్లుతారని అందరూ భావించారు.

Read Also: ఫైనల్‌కు ముందు నిద్ర పట్టలేదు: వైభవ్ సూర్యవంశీ

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>