కలం, డెస్క్ : సూర్యాపేట (Suryapet) మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల స్కూల్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఇద్దరు విద్యార్థినులు అర్ధరిత్రి గోడ దూకి ఇద్దరు అబ్బాయిల బైక్ పై వెళ్లి తెల్లవారు జామున తిరిగి వచ్చారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకుల హాస్టల్ లో కనీస పర్యవేక్షణ కూడా లేదంటూ విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటివి గతంలోనూ జరిగాయని.. సిబ్బంది పట్టించుకోవట్లేదని మిగతా విద్యార్థినులు చెబుతున్నారు.
Read Also: ఫొరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై డీజీ విక్రమ్ సింగ్ అత్యవసర సమీక్ష
Follow Us On : WhatsApp


