Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రభుత్వ సలహాదారు కేకే కుమారుడికి బెదిరింపులు

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఒక స్థలం వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వ సలహాదారు కేకే కుమారుడు వెంకట్ రావు (Venkat Rao)కు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నిందితులు తనను మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు బాధితుడు పేర్కొన్నారు.

వెంకట్ రావు (Venkat Rao) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న ఒక ఖరీదైన స్థలం విషయంలో కొంతకాలంగా వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు తనను అడ్డుకుని, డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు ఆయన తన ఫిర్యాదులో వివరించారు.

వెంకట్ ఫిర్యాదు మేరకు పోలీసులు సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన గడీల రఘువీరారెడ్డి, అన్వేశ్‌ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>