Mobile Popup Ad
Mobile Popup Ad

యూపీలో ట్ర‌క్కు బీభ‌త్సం.. ఆరుగురు మృతి

క‌లం, వెబ్ డెస్క్‌: ఉత్తరప్రదేశ్‌లో ఓ ట్ర‌క్కు బీభ‌త్సం సృష్టించింది. డ్రైవ‌ర్‌ అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌న ఉన్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మతురా సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వే(Yamuna Expressway)పై శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని గాయ‌ప‌డ్డ వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతి చెందిన వారంతా ఢిల్లీ నుండి కాన్పూర్‌కు వెళ్తున్న బస్సు ప్రయాణికులుగా గుర్తించారు. మార్గ మ‌ధ్య‌లో డ్రైవ‌ర్‌ విరామం కోసం బ‌స్సు ఆపిన‌ప్పుడు ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వేగంగా వచ్చిన కంటైనర్ ట్రక్కు డ్రైవర్ కంట్రోల్ కోల్పోయి ఆగి ఉన్న‌ బస్సును ఢీ కొట్టాడు. బ‌స్సు ప‌క్క‌నే కొంద‌రు ప్ర‌యాణికులు నిల్చొని ఉన్నారు. ట్ర‌క్కు వేగంగా ఢీకొట్ట‌డంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి అత్యవసర సేవల బృందం చేరుకొని వెంటనే రక్షణ చర్యలు చేపట్టింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ, పూర్తి విచారణ ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>