epaper
Monday, November 17, 2025
epaper

తెలంగాణలో మరో 15ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే: కోమటిరెడ్డి

తెలంగాణలో మరో 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Minister Komatireddy) ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్ సాధించిన విజయం ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని అన్నారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమానికే ప్రజలు ఓటేశారని అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ(Miryalaguda) మండలం కాల్వపల్లి ప్రాంతంలో రింగురోడ్డు నిర్మాణ పనులకు, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మరియు ఎంపీ రఘువీర్ రెడ్డితో కలిసి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నికలో ఒక పార్టీ డిపాజిట్ కూడా కాపాడుకోలేకపోయిందని, మరో పార్టీ అంతర్గత కలహాలతో ఇబ్బందులు పడుతోందని వ్యాఖ్యానించారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక నమూనా నియోజకవర్గంగా అభివృద్ధి చేసే దిశగా పని చేస్తున్నామన్నారు. ప్రాంతంలోని అన్ని సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చే పనులు జరుగుతున్నాయని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే, మరింత వేగంగా మరియు విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టగలమని కోమటిరెడ్డి(Minister Komatireddy) పేర్కొన్నారు.

Read Also: బంగ్లా మాజీ ప్రధానికి మరణ దండన

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>