epaper
Wednesday, February 18, 2026
epaper

గడ్చిరోలి ఎన్​కౌంటర్​.. లోకేటి చందర్​ రావు సహా ఏడుగురి మృతి

కలం, వెబ్​డెస్క్​: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్ (Gadchiroli Encounter)​​ లో తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు చెందిన లోకేటి చందర్​ రావు అలియాస్​ ప్రభాకర్​ సహా ఏడుగురు నక్సల్స్​ మృతి చెందారు. ఈ ఘటనలో ఓ పోలీస్​ సైతం గాయపడ్డారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మూడు రోజుల నుంచి గడ్చిరోలి అటవీ ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలసి స్పెషల్​ యాంటీ నక్సల్స్​ దళాలు కూంబింగ్​ చేస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి నారాయణపూర్​–గడ్చిరోలి సరిహద్దులోని ఫూడెవాడ గ్రామం వద్ద భద్రతా దళాలకు నక్సలైట్లు ఎదురయ్యారు.

దీంతో ఇరువైపులా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మూడు మృతదేహాలను గురువారం రాత్రే స్వాధీనం చేసుకున్న దళాలు.. శుక్రవారం మరో నలుగురి మృతదేహాలను గుర్తించాయి. చనిపోయినవాళ్లలో గడ్చిరోలి మావోయిస్ట్​ డివిజన్​ కమిటీ ఇన్​ఛార్జ్​ ప్రభాకర్​ అలియాస్​ లోకేటి చందర్​ రావు (Loketi Chandar Rao) ఉన్నారు. ఈయనపై రూ.20లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిగిలినవాళ్ల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, సెర్చింగ్​ కొనసాగుతోందని వాళ్లు వెల్లడించారు.

1995 నుంచి అజ్ఞాతంలో..

కామారెడ్డిలోని ఇస్రోజివాడి సదాశివ నగర్​కు చెందిన లోకేటి రాంచందర్​ రావు కుమారుడు లోకేటి చందర్​ రావు(57). ఈయన 7వ తరగతి వరకు చదివారు. మావోయిస్ట్​ భావజాలానికి ఆకర్షితులై ఉద్యమ బాట పట్టారు. 1995 నుంచి అజ్ఙాతంలో ఉన్నారు. ఉద్యమ సమయంలో స్వామి, పడకల స్వామి, రవి, ప్రభాకర్​ అనే పేర్లు ఉన్నాయి. దళంలో ఎస్సీఎం, ఎస్​ఎంసీ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. 4వ కంపెనీకి ఇన్​చార్జిగా ఉన్నారు. గడ్చిరోలి మావోయిస్ట్​ డివిజన్​ కమిటీలో వెస్ట్​ రీజనల్​ కమాండ్​(డబ్ల్యూఆర్​సీ) కార్యదర్శిగా పనిచేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>