epaper
Wednesday, February 18, 2026
epaper

అండర్​ ‌‌19 ఫైనల్: భారత్ భారీ స్కోరు

కలం, వెబ్​ డెస్క్​ : అండర్ 19 వరల్డ్ కప్ (U19 World Cup) ఫైనల్‌లో టీమిండియా బ్యాటర్లు వీర విహారం చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ ముందు 412 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. భారత బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో మొత్తం 175 పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానంలో 51బంతుల్లో 53 పరుగులు చేసి ఆయుష్ మాత్రే అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన వారు కూడా శక్తి వంచన లేకుండా డబుల్ డిజిట్ పరుగులు చేశారు. ఓపెనర్ ఆరోన్ జార్జ్ మాత్రం కేవలం 9 పరుగులకే పెవిలిచన్ చేరి కాస్తంత నిరాశ పరిచినా ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు ఆ లోటు లేకుండా విజృంభించారు.

ఇంగ్లండ్ బౌలర్లో రాల్‌ఫీ ఆల్బెర్ట్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. పది ఓవర్లు బౌల్ చేసిన ఆల్బెర్ట్ కేవలం 66 పరుగులే సమర్పించాడు. మాని లంస్‌డెన్ మాత్రం 8 ఓవర్లు బౌలింగ్ చేసి 81 పరుగులు సమర్పించి ఒక్క వికెట్ తీశారు. జేమ్స్ మింటో 8 ఓవర్ల బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టి 63 పరుగులు ఇచ్చాడు. మిగిలిన వారు కూడా పర్వాలేదు అన్నట్లు ప్రదర్శన కనబరిచాడు. కాగా ఇప్పుడు భారత బౌలర్లు బ్యాటర్ల ఫామ్‌ను మించిన ఆటతీరును కనబరుస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

Read Also: U-19 ఫైనల్: విజృంభించిన వైభవ్.. 80 బంతుల్లో రికార్డ్..

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>