epaper
Wednesday, February 18, 2026
epaper

17వ అంతస్థు నుంచి దూకి ముల్తానీ బేకరీ ఓనర్​ సూసైడ్​

కలం, వెబ్​డెస్క్​: నిర్మాణంలో ఉన్న బిల్డింగ్​ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన మహారాష్ట్రలోని పుణేలో (Pune) జరిగింది. చనిపోయిన వ్యక్తిని ప్రముఖ వ్యాపారవేత్త, సోలాపూర్​లోని ముల్తానీ బేకరీ ఓనర్​ సునీల్​ మోతీలాల్​ సదరాంగని (Sunil Motilal Sadarangani) గా గుర్తించారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణేలోని విజాపూర్​ రోడ్డు పక్కన కొత్తగా నిర్మిస్తున్న 17 అంతస్థుల బిల్డింగ్​పైకి సునీల్​ గురువారం సాయంత్రం చేరుకున్నాడు. అనంతరం కాసేపు అక్కడక్కడే తిరిగాడు.

సమీపంలోని ఇళ్ల నుంచి కొంతమంది ఈ విషయాన్ని గమనించి వీడియో తీశారు. సునీల్​ ఉన్న బిల్డింగ్​ వాచ్​మ్యాన్​కు సమాచారం ఇచ్చారు. వెంటనే అతను, మరో వ్యక్తి బిల్డింగ్​ పైకి వెళ్లారు. సునీల్​తో మాట్లాడి కిందకు తీసుకొస్తుండగా, పదో అంతస్థు వరకు వచ్చిన ఆయన ‘కారు తాళాలు పైనే మర్చిపోయానంటూ వెనక్కి పరిగెత్తాడు. బిల్డింగ్​పైకి చేరుకోగానే ఒక్కసారిగా అక్కడి నుంచి కిందకు దూకేశాడు. వెనకాలే ఇద్దరూ వచ్చినప్పటికీ ఆపలేకపోయారు.

వాళ్లు వెంటనే కిందకు దిగి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం, తీవ్రంగా గాయపడిన సునీల్​ను​ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సునీల్​ మోతీలాల్​ సదరాంగని (Sunil Motilal Sadarangani) కొన్నేళ్ల కిందట షోలాపూర్​ నుంచి వచ్చి పుణేలో స్థిరపడ్డారు. కాగా, ఆత్మహత్యకు ముందు సునీల్​ బిల్డింగ్​పై ఉండగా తీసిన వీడియో సోషల్​ మీడియాలో వైరలైంది.

Read Also: U-19 ఫైనల్: విజృంభించిన వైభవ్.. 80 బంతుల్లో రికార్డ్..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>