Mobile Popup Ad
Mobile Popup Ad

పొలిటిక‌ల్ పార్టీపై క‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

క‌లం, వెబ్ డెస్క్‌: రాజ‌కీయ పార్టీ ప్ర‌క‌ట‌న‌పై క‌విత (Kavitha)  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే కొత్త రాజ‌కీయ పార్టీపై ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని వెల్ల‌డించారు. శుక్ర‌వారం క‌విత మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. త‌న‌కు సెంటిమెంట్ ఎక్కువ అని, పార్టీ ప్ర‌క‌టించేందుకు మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాన‌ని క‌విత వెల్ల‌డించారు. వ‌చ్చే మూడు నెల‌ల్లోనే పార్టీని ప్రకటించ‌నున్న‌ట్లు తెలిపారు. మ‌రోవైపు మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌పై క‌విత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సిరిసిల్లలో 16 మంది బీఆర్ఎస్ వాళ్లు టికెట్ కోసం క‌విత‌ను సంప్ర‌దించిన‌ట్లు వెల్ల‌డించారు. కేటీఆర్, హరీష్ రావులు ఇతర జిల్లాల్లో ఎందుకు తిరగడం లేద‌ని క‌విత ప్ర‌శ్నించారు. జాగృతి బరిలో ఉన్న చోటే హరీశ్ రావు ఎందుకు ప్ర‌చారం చేస్తున్నార‌ని నిల‌దీశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>