Mobile Popup Ad
Mobile Popup Ad

కాఫీ ఇవ్వలేదని హోటల్ మీదకి జేసీబీతో మున్సిపాలిటీ అధికారి

కలం, వెబ్ డెస్క్: కడప (Kadapa) జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఆశ్చర్యపరిచే ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని మెయిన్ రోడ్డు వద్ద ఉన్న ఓ హోటల్‌‌కు  స్థానిక మున్సిపాలిటీ అధికారి వెళ్ళాడు. అక్కడ ఒక కాఫీ (Coffee) ఆర్డర్ చేసి, దాన్ని 1/3 (మూడు భాగాలుగా) చేసి ఇవ్వమని అడిగాడు. హోటల్ యాజమాన్యం దానికి నిరాకరించడంతో అధికారి ఆగ్రహించాడు. వెంటనే జేసీబీ (JCB)  తెప్పించి, హోటల్ ముందు ఉన్న అక్రమ ర్యాంప్‌ను తొలగించేందుకు ప్రయత్నించాడు. హోటల్ యజమాని రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేయడంతో, అధికారులు వెనక్కి తగ్గారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో  బాగా వైరల్ అవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>