బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య(Rohini Acharya) వివాదంపై లాలూ పెద్ద కొడుకు ప్రతాప్ యాదవ్(Tej Pratap Yadav) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన సోదరిని అవమానించారని, దానికి భయంకర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తనను ఎన్ని మాటలు అన్నా, పార్టీ నుంచి, కుటుంబం నుంచి వెళ్లగొట్టినా భరించానని, కానీ రోహిణిని అవమానించిన విషయంలో ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన సోదరుడు తేజస్వీ యాదవ్ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల ప్రేరేపణతోనే తనను కుటుంబం నుంచి ఒంటరిగా నిలిపారని రోహిణి తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై చెప్పులతో దాడి చేయబోయారని కూడా ఆమె చెప్పారు. ఈ ఘటనపై ఆమె అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తన సోదరిపై జరిగిన అన్యాయం తాను సహించలేనని, కుటుంబ సభ్యులపై ఎవరైనా దాడి చేయాలని చూస్తే చేతులు కట్టుకుని కూర్చోనని ప్రతాప్(Tej Pratap Yadav) హెచ్చరించారు. ‘‘నన్ను కూడా పార్టీ నుంచి, కుటుంబం నుంచి బయటకు నెట్టేశారు. చాలా విమర్శలు ఎదుర్కొన్నా, మౌనం వహించాను. కానీ రోహిణిపై చెప్పులతో దాడి చేయబోయారని తెలిసినప్పటి నుంచి నా మనసు మండిపోతోంది. ఇది ఏ పరిస్థితుల్లోనూ సహించలేనిది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ విషయంలో నా తండ్రి లాలూ ప్రసాద్ ఒక్క అవకాశం ఇస్తే చాలు… ఇటువంటి ‘జైచంద్’లను బిహార్ ప్రజలే గద్దెదించేస్తారు. ఎందుకంటే ఇది కేవలం పార్టీ విషయమే కాదు; ఒక కుటుంబ గౌరవం, ఒక తల్లి–కుమార్తె పరువు, ఒక రాష్ట్ర ప్రతిష్ట గురించి జరుగుతున్న పోరాటం’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Read Also: ‘కర్మ హిట్స్ బ్యాక్’ విమర్శ.. ఎవరికో చెప్పిన కవిత
Follow Us on : Pinterest

