epaper
Wednesday, February 18, 2026
epaper

మున్సిపల్ బరిలో ‘సేవ్ గర్ల్’ ఉద్యమ జంట.. ఆడపిల్ల పుడితే రూ.3116

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) మున్సిపల్ ఎన్నికల్లో సేవ్ గర్ల్ ఉద్యమ జంట బరిలోకి దిగింది. 37వ డివిజన్ నుంచి బల్ల ఆకాంక్ష శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన ఆకాంక్షకు ఫ్రాక్ గుర్తు కేటాయించారు అధికారులు. దేశంలో సేవ్ గర్ల్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఉద్యమం చేస్తున్నారు. ఆడ పిల్లల్ని పురిట్లోనే చంపొద్దని, చెత్త కుప్పల్లో వేయొద్దని ప్రచారం నిర్వహించారు. సేవ్ గర్ల్ పేరుతో ఫ్లెక్సీలు ప్రదర్శించారు. తమ పిల్లలతో కలిసి వినూత్న ప్రదర్శన చేపట్టారు. నిజామాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.

నిజామాబాద్ (Nizamabad) కేంద్రంగా ప్రారంభమైన వీరి ఉద్యమం దేశ రాజధాని ఢిల్లీ సైతం చేరింది. ప్రత్యేక సేవ్ గర్ల్ (Save Girl) డిపార్ట్ మెంటు ఏర్పాటు చేయాలని కోరుతూ శ్రీనివాస్ ఇటీవలే నిజామాబాద్ నుంచి ఢిల్లీకి 1425 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేపట్టాడు. అయ్యప్ప మాల వేసుకొని ఎముకలు కొరికే చలిలో సైకిల్‌పై ఢిల్లీ వెళ్లాడు. ప్రధాని మోడీని కలిసే ప్రయత్నం చేయగా వీలు పడలేదు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ఇతర పార్టీల జాతీయ నేతలు కలిసి వినతిపత్రాలు అందించాడు. తన విన్నపాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని వేడుకున్నాడు. ఇప్పుడు ఈ ఉద్యమ జంట నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగింది. ఆడ పిల్లల రక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటయ్యే వరకు పోరాడుతామని, ఆడ పిల్ల పుడితే 3116 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరుతున్నారు.

Read Also: నిజాయితీకి నీరాజనం.. పారిశుద్ధ్య కార్మికురాలి కాళ్లు మొక్కిన తమిళ నటుడు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>