కలం, వెబ్ డెస్క్ : ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో రెండేళ్లుగా హడావిడి చేశారన్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శలు చేశారు. ఇన్ని రోజులు గడిచినా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓ డీఎస్పీని సీఐ గా డిమొట్ చేసిన గొప్పకార్యం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న చర్య ఇదొక్కటేనని ఆయన ఆరోపించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒకటేనని చెప్పారు. బీఆర్ఎస్ అవినీతిని బయటపడతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిందని, కానీ అలాంటి చర్యలు ఏం తీసుకోలేదన్నారు. దీనికి కారణం ఆ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో కేసీఆర్ కు ఒప్పందం కుదిరినందునే బీఆర్ఎస్ వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోరని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగానా తెలంగాణ రాష్ట్రం నుంచే డబ్బులు వెళ్తున్నట్లు కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. కాంగ్రెస్ కు తెలంగాణ బంగారు బాతుగా మారిందన్నారు కిషన్ రెడ్డి.
Read Also: పాక్ జట్టుకు అసలు బలం అదే: అశ్విన్
Follow Us On : WhatsApp


