Red Fort Blast | ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు కేసు దర్యాప్తులో దర్యాప్తు సంస్థలు వేగం పెంచాయి. తాజాగా ఈ ఘటనకు సంబంధించి కీలక ఆధారం లభించింది. ఘటన స్థలంలో ఆధారాల కోసం వెతుకుతున్న క్రమంలో అధికారులకు సైనికులు వినియోగించే బుల్లెట్లు దొరికాయి. సంఘటనకు సంబంధించిన ఆధారాలను వెతికే ప్రక్రియలో ఫోరెన్సిక్ టీమ్ కీలకమైన సాక్ష్యాలను బయటకు తీసింది. ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఘటన స్థలం దగ్గర మూడు 9 మిల్లీమీటర్ల కార్ట్రిడ్జ్‌లు స్వాధీనం అయ్యాయి. ఇవి సాధారణంగా సైనిక విభాగంలో ఉపయోగించే రకం కావడంతో విచారణాధికారులు మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
Red Fort Blast | కార్ట్రిడ్జ్‌లు దొరికినప్పటికీ ఏ విధమైన తుపాకులు లేదా పిస్టళ్లు మాత్రం అక్కడ లభ్యం కాలేదు. దీంతో ఈ బుల్లెట్లు అక్కడికి ఎలా వచ్చాయి అన్న దానిపై దర్యాప్తు కొత్త దశలోకి వెళ్లింది. సంఘటన జరిగిన తర్వాత అక్కడ విధులు నిర్వహించిన పోలీసులు, భద్రతా సిబ్బందికి కేటాయించిన ఆయుధాల్లోని బుల్లెట్లను కూడా ప్రత్యేకంగా పరిశీలించారు. వాటితో పోల్చినప్పుడు, సంఘటన స్థలంలో లభ్యమైన కార్ట్రిడ్జ్‌లు సెక్యూరిటీ స్టాఫ్‌కు చెందినవి కాదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఈ తాజా ఆధారాలు కేసు దిశను మార్చే అవకాశం ఉన్నందున, దర్యాప్తు సంస్థలు మరింత గాఢమైన విచారణకు సిద్ధమవుతున్నాయి.
Read Also: ‘ఐబొమ్మ’ క్లోజ్.. వందల హార్డ్ డిస్క్‌లు స్వాధీనం
Follow Us on : ShareChat

