కలం, వెబ్ డెస్క్ : ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reels) పిచ్చి ఓ యువకుడి ప్రాణం తీసింది. కడప (Kadapa) జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనలో ముబారక్ (20) అనే యువకుడు బైక్‌పై నుంచి పడి మృతి చెందాడు. ఎక్కువ వ్యూస్ వస్తాయనే ఆశతో ముబారక్ తన స్నేహితుడితో కలిసి బైక్ తో విన్యాసాలు చేస్తూ రీల్స్ చిత్రీకరిస్తుండగా, అదుపుతప్పి కిందపడినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో ముబారక్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ముబారక్ ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు బైక్‌పై ఉన్న మరో యువకుడికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. మెరుగైన చికిత్స కోసం అతడిని బెంగళూరుకు తరలించారు. యువత సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన కడప జిల్లాలో (Kadapa District) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Read Also: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు నిజమే: పవన్ కల్యాణ్
Follow Us On: X(Twitter)


