ఎప్‌స్టీన్‌తో స‌హ‌వాసంపై బిల్ గేట్స్ పశ్చాత్తాపం..!

క‌లం, వెబ్ డెస్క్‌: లైంగిక నేరాల కేసులో దోషిగా తేలిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌(Jeffrey Epstein)తో తాను గడిపిన ప్రతి క్షణం పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్(Bill Gates) తెలిపారు. మరోవైపు ఎప్‌స్టీన్‌తో త‌న‌కు ఉన్న సంబంధాలపై బిల్‌గేట్స్ ఇంకా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఉన్నాయ‌ని ఆయన మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ స్పష్టం చేశారు. గత వారం అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన పత్రాల్లో ఎప్‌స్టీన్‌కు సంబంధించి పలువురు ప్రముఖులతో ఉన్న ఈమెయిల్స్ బయటపడ్డాయి. వీటిలో స్నేహపూర్వక సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.

ఈ పత్రాల్లో ఉన్న ఓ డ్రాఫ్ట్ ఈమెయిల్‌లో, బిల్ గేట్స్‌పై ఎప్‌స్టీన్‌ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. రష్యన్ యువతులతో శారీరక సంబంధాల తర్వాత వచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు డ్రగ్స్ తెచ్చిపెట్టడం నుంచి, వివాహిత మహిళలతో అక్రమ సంబంధాలకు సహకరించడం వరకు గేట్స్‌తో తన అనుబంధం ఉందని ఎప్‌స్టీన్‌ పేర్కొన్నాడు. ఈ ఆరోపణలపై స్పందించిన బిల్ గేట్స్, ఆస్ట్రేలియాకు చెందిన ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. “ఎప్‌స్టీన్‌తో గడిపిన ప్రతి నిమిషం పట్ల నాకు పశ్చాత్తాపం ఉంది. అందుకు నేను క్షమాపణ కూడా చెబుతున్నాను. అయితే ఆ ఈమెయిల్ ఎప్పుడూ పంపలేదు. అందులోని ఆరోపణలు పూర్తిగా అవాస్తవం” అని అన్నారు. అతని ఆలోచన ఏమిటో త‌న‌కు తెలియద‌ని బిల్‌ గేట్స్ చెప్పారు. మ‌రోవైపు బిల్‌గేట్స్ ప్ర‌తినిధి దీనిపై కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. బిల్‌ గేట్స్‌తో సంబంధం కొనసాగలేకపోయినందుకు ఎప్‌స్టీన్‌ నిరాశకు గురయ్యాడ‌ని, ఆ కారణంతోనే గేట్స్‌ను ఇరికించేందుకు, అపకీర్తి పాలు చేయడానికి ప్రయత్నించాడ‌ని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>