epaper
Wednesday, February 18, 2026
epaper

అప్పుడు నాట్లకు నాట్లకు మధ్య.. ఇప్పుడు ఓట్లకు ఓట్లకు మధ్య..

కలం, ఖమ్మం బ్యూరో : కేసీఆర్ ప్రభుత్వం నాట్లకు నాట్లకు మధ్య రైతులకు పెట్టుబడి సాయం అందిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లకు ఓట్లకు మధ్య పెట్టుబడి సాయం ఇస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay Kumar) ఎద్దేవా చేశారు. వైరా మున్సిపాలిటీ పరిధిలో బుధవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైరా మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్నారు. వైరా లో బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

వైరా మున్సిపల్ ఎన్నికల్లో (Wyra Municipal Elections) బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించి క్లారిటీతో పనిచేస్తున్నామని మిగతా పార్టీలు అంత దైర్యం చేయలేకపోతున్నాయన్నారు. ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రత్యర్ధులు కొన్ని వార్డులనందు చపాతీ రోలర్ గుర్తులతో కన్ఫ్యూజ్ చేస్తున్నారని అలాంటి ఎత్తు గడలను తిప్పి కొట్టాలన్నారు. కాంగ్రెస్ గడిచిన 25 నెలల కాలంలో ప్రజలను మోసం చేసి 6 గ్యారంటీలకు మంగళం పాడిందని ఆయన (Puvvada Ajay) విమర్శలు గుప్పించారు.

Read Also: రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>