గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై ‘చిన్నారి’ అవేర్‌నెస్.. ఖమ్మంలో వినూత్నం

ఖమ్మం, కలం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లాలోని చిన్నారుల రక్షణ కోసం మహిళా-శిశు సంక్షేమ శాఖ “చిన్నారి” అనే వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా సుమారు 1000 విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు, తల్లిదండ్రులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు, తమకు ఎదురయ్యే ఏ విషయాన్నైనా భయం లేకుండా తల్లిదండ్రులతో పంచుకునేలా పిల్లలను ప్రోత్సహిస్తున్నారు.

కేవలం రక్షణే కాకుండా, లింగ సమానత్వం, సంస్కారం నేర్పించడం కూడా “చిన్నారి” ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు. ఇంట్లో మగ, ఆడ పిల్లల మధ్య వివక్ష చూపకుండా పెంచాలని, పెద్దలు గౌరవప్రదంగా ప్రవర్తిస్తూ పిల్లలకు ఆదర్శంగా నిలవాలని తల్లిదండ్రుల (Parents)కు సూచిస్తున్నారు. చిన్నతనం నుంచే పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచడం, క్రమశిక్షణతో కూడిన పెంపకం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. భావి భారత పౌరులను బాధ్యతాయుతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.

Read Also: మీరు పైసలిస్తే మేం సర్వే చేస్తాం.. సమ్మక్క బ్యారేజీపై చత్తీస్‌గఢ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>