కలం డెస్క్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అత్యంత ఎక్కువ మార్జిన్‌తో విజయం సాధించిన ఎమ్మెల్యే నవీన్ కుమార్(Naveen Yadav)ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) ప్రశంసించారు. గెలిచిన తర్వాత తొలిసారి ఢిల్లీ వెళ్ళిన నవీన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను సైతం కలుసుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఆయనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ తీసుకెళ్ళారు. జూబ్లీ హిల్స్ ఇంతకాలం బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైనప్పటికీ రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు సమిష్టి కృషితో గెల్చుకున్నట్లు రాహుల్‌గాంధీకి సీఎం రేవంత్(Revanth Reddy) వివరించారు. గతంలో రెండు సార్లు పోటీచేసి ఓడిపోయినా ప్రజల మధ్యనే ఉండి పనిచేశారని, వారి మనసును చూరగొన్నారని, చివరకు అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందారని సీఎం వివరించారు.
జూబ్లీ హిల్స్ స్థానాన్ని గెల్చుకోడానికి కాంగ్రెస్ అనుసరించిన వ్యూహం, వివిధ స్థాయిల్లోని నేతలందరితో వరుస సమావేశాలు నిర్వహించి కష్టపడి పనిచేయాల్సిందిగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) తీసుకున్న చొరవ తదితరాలన్నింటినీ రాహుల్‌గాంధీ అడిగి తెలుసుకున్నారు. రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌ను కలవడానికి జరిగిన సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్(Naveen Yadav), నాయకుడు రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Also: హరీష్ రావు పై మరో భారీ బాంబు పేల్చిన కవిత
Follow Us on : Pinterest

