కలం, వరంగల్ బ్యూరో: వేతనాల పెంపు విషయంలో యజమానుల మొండి వైఖరిని నిరసిస్తూ గురువారం హనుమకొండ (Hanumakonda), వరంగల్ (Warangal) ఒకటో డిపో, రెండో డిపోల అద్దె బస్సుల డ్రైవర్లు సమ్మెకు (Bus Drivers Strike) పిలుపునిచ్చారు. నెలకు కనీసం రూ.2,600 పెంచాలని డ్రైవర్లు కోరుతుండగా, యజమానులు కేవలం రూ.1,400 మాత్రమే పెంచుతామని తెగేసి చెప్పారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్వయంగా మాట్లాడినా యజమానులు దిగిరాకపోవడంతో రేపు బస్సులను స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్లు డ్రైవర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బస్సు యజమానులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
Read Also: స్పీకర్ తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టు: కేటీఆర్
Follow Us On: Youtube


